ఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సింగపూర్ స్మాష్‌లో భారత పురుషుల డబుల్స్ జోడీ మానవ్ ఠక్కర్, మానుష్ షా స్ఫూర్తిధాయక పోరాటం సెమీస్‌లో ముగిసింది. ది కల్లాంగ్లో శుక్రవారం జరిగిన సెమీస్ పోరులో భారత ద్వయం.. 2-3 (6-11, 11-7, 10-12, 11-9, 8-11)తో ఫ్రాన్స్ సోదర జోడీ అలెక్సిస్, ఫెలిక్స్ లెబ్రన్ చేతిలో పోరాడి ఓడింది.
ఈ టోర్నీ చరిత్రలోనే తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించిన ప్యాడ్లర్లుగా చరిత్ర సృష్టించిన ఈ జోడీ.. గెలుపు కోసం ఆఖరి దాకా పోరాడినా చివరి గేమ్‌లో చేసిన తప్పిదాలతో పరాభవం వైపు నిలవాల్సి వచ్చింది.