Inter Admissions | హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి గడువు పొడిగించింది. సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఇదే చివరి అవకాశం అని, అర్హులైన విద్యార్థులు ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు.
ఇక ఇంటర్లో ప్రవేశం తీసుకోవాలనుకునే విద్యార్థులు ఇంటర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు తప్పనిసరిగా దరఖాస్తుకు జతపరచాలి. ప్రొవిజినల్ అడ్మిషన్ పూర్తయిన తర్వాత కచ్చితంగా ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ బోర్డు చేత గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఇంటర్మీడియట్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఆ జాబితా ఆధారంగా అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
TG PECET | టీజీ పీఈసెట్ 2024 సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల
KTR | పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు.. మండిపడ్డ కేటీఆర్