హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందులో పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి పోటీచేసి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్.. ఆరు నెలలు తిరగక ముందే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీచేశారని అందులో ప్రస్తావించారు.
రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. దీనిపై దానలు విన్న హైకోర్టు ధర్మాసనం.. అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.