TG PECET | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. టీజీ పీఈసెట్ -2024 ప్రవేశాలకు సంబంధించి సెకండ్, ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీ నుంచి వచ్చే నెల 3 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ తేదీల్లోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా జరగనుంది. వెబ్ ఆప్షన్లకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నారు.
4, 5 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 6వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 8న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సెకండ్ ఫేజ్లో సీట్లు పొందిన అభ్యర్థులు అలాట్మెంట్ ఆర్డర్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కాలేజీలకు వెళ్లి.. 9 నుంచి 12వ తేదీలోపు ప్రవేశం పొందొచ్చు. ఇతర వివరాలకు టీజీ పీఈసెట్ వెబ్సైట్ను సందర్శించొచ్చు.
ఇవి కూడా చదవండి..
KTR | పేదల ఇళ్లపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు.. మండిపడ్డ కేటీఆర్
Hand Casting | ప్రాణంగా ప్రేమించిన భార్య అనారోగ్యంతో మృతి.. భర్త ఏం చేశాడో తెలుసా..?
Innovative protest | చెవిలో పూలు పెట్టుకొని రైతు వినూత్న నిరసన.. ఎందుకంటే?