జగిత్యాల : పంటరుణాల మాఫీపై(Loan waiver) సర్కారు పెట్టిన ఆంక్షలు రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని దేవుడి మీద ఒట్టేసి మరీ చెప్పిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు కొర్రీలు విధించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రైతు రుణమాఫీలో భాగంగా జగిత్యాల జిల్లా(Jagithyala) మెట్పల్లి మండలం వెల్లుల్లలో నిర్వహిస్తున్న కుటుంబ నిర్ధారణ సర్వేలో సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మారు మురళీధర్ రెడ్డి చెవిలో పూలు పెట్టుకొని వినూత్న పద్ధతిలో(Innovative protest) నిరసన తెలిపాడు. ప్రభుత్వం వద్ద అన్ని వివరాలు ఉన్నప్పటికీ రైతులను మోసం చేసేందుకే కుటుంబ నిర్ధారణ సర్వే చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.