న్యూఢిల్లీ: మద్యం కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్చిట్ ఇవ్వడంతో బీజేపీపై నెటిజన్లు మండిపడ్డారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలు బయటపడ్డాయని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, విపక్షాలకు వ్యతిరేకంగా ఏజెన్సీలను దుర్వినియోగపర్చారని మరొకరు పోస్ట్ చేశారు.
ఆధారాలు లేకుండా నెలలపాటు జైలు జీవితాన్ని గడిపారంటూ కేజ్రీవాల్, సిసోడియాను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేయగా.. ప్రజలకు బీజేపీ పెద్దలు క్షమాపణలు చెప్పాలంటూ మరో నెటిజన్ డిమాండ్ చేశారు.