హైదరాబాద్ : యాదగిరిగుట్ట(Yadagirigutta) అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఆదేశాలిచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు(Yadagirigutta Temple Board) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని,భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సూచించారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలన్నారు.