Deputy CM Pawan Kalyan | ‘పుష్ప’పై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాత
Deputy CM Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల బెంగళూరు పర్యటనలో ఉన్నప్పుడు అడవుల నరికివేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు. కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం హీరోయిజం అయిపోయింది.
Deputy CM Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల బెంగళూరు పర్యటనలో ఉన్నప్పుడు అడవుల నరికివేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు. కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం హీరోయిజం అయిపోయింది. నేను ఆ పరిశ్రమలో ఉన్నానని అలోచించుకుంటే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంటుంది. ఇలాంటివి తగ్గి మళ్లీ అడవుల ప్రాముఖ్యత తెలిసేలా సినిమాలు రావాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం లాంటివి ఉండడంతో కావాలని వ్యాఖ్యలు చేస్తున్నాడని అల్లు ఫ్యాన్స్ పవన్‌పై విమర్శలు గుప్పించారు.
ఇదిలావుంటే తాజాగా ఈ వివాదంపై ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డేట్స్ కోసం పవన్ కళ్యాణ్‌ను కలిసిన రవిశంకర్ ఈ విషయంపై స్పందించాడు. గొడ్డళ్లు పట్టుకొని చెట్ల నరికివేత, స్మగ్లింగ్ చేయడం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ను ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చారు. పవన్ అలా ఎప్పుడు మాట్లాడరని.. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని చెబుతాడని చెప్పుకోచ్చాడు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ మధ్యే పవన్ కల్యాణ్‌ను కలిశాను. త్వరలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది జనవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలి అనుకుంటున్నాం. సెప్టెంబర్ 02 పవన్ బర్త్‌డే నాడు ఓ సర్ప్రైజ్ కచ్చితంగా ఉండబోతుంది అంటూ రవి శంకర్ చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

