అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుంది. పార్టీ నుంచి ఒక్కొక్కరూ జారుకుంటుండడంతో ఆ పార్టీలో అయోమయపరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నుంచి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు (YCP MLCs ) రాజీనామా చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కర్రిపద్మశ్రీ (Karmi Padmasri, ఎమ్మల్యే కోటా ఎన్నికైన బల్లి కల్యాణ్ చక్రవర్తి(Kalyana Chakravarthi) అనే ఇద్దరు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేశారు.
ఎమ్మెల్సీ పదవులతో పాటు వైసీపీకి రాజీనామాచేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా మూడుకు చేరుకుంది. నిన్న వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో రూపొందించి రాజ్యసభ చైర్మన్ ధన్కడ్ జగదీప్కు అందజేశారు.
తాను టీడీపీలో చేరుతున్నట్లు వెంకటరమణ ప్రకటించగా , కుటుంబ సభ్యులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటానని మస్తాన్రావు వెల్లడించారు. 32 సంవత్సరాల పాటు టీడీపీలో కొనసాగిన మస్తాన్రావు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీకి రాజీనామా చేశారు. కాగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్ల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరారు.