GDP | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో ఆర్బీఐ అంచనాలకు భిన్నంగా జీడీపీ వృద్ధిరేటు మందగించింది. 2023-24తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయి 6.7 శాతంగా నమోదైంది. వ్యవసాయం, మైనింగ్ ఇండస్ట్రీస్ వృద్ధిరేటు గతేడాది ఇదే కాలంలో 4.2 శాతం ఉంటే.. ఈ ఏడాది 2.7 శాతంతోనే సరిపెట్టుకున్నది. వార్షిక ప్రాతిపదికన వ్యవసాయ వృద్ధిరేటు 3.7 శాతం నుంచి రెండు శాతానికి పడిపోవడం ఆందోళనకరమే. సానుకూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు జీడీపీ వృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ నెల ప్రారంభంలో జరిగిన ద్రవ్య పరపతి సమీక్ష ముగింపు తర్వాత జీడీపీ వృద్ధిరేటు 7.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
మాన్యుఫాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ పరిశ్రమల్లో గణనీయ పురోగతి నమోదై 5.9 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగింది. మాన్యుఫాక్చరింగ్ లావాదేవీలు 5.0 శాతం నుంచి 7.0 శాతానికి పెరిగాయి. ఫైనాన్సియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ గ్రోత్ రేటు 2023-24తో పోలిస్తే 12.6 నుంచి 7.1 శాతానికి పతనం అయ్యాయి. ట్రేడ్, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్స్ అండ్ సర్వీసెస్ విభాగాల వృద్ధిరేటు సైతం 9.7 నుంచి 5.7 శాతానికి పడిపోయింది.
Stocks | రికార్డు గరిష్టాలకు స్టాక్ మార్కెట్లు.. 25 వేలు దాటిన నిఫ్టీ..!
Forex Reserves | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు..!
Air India- Vistara | ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనానికి కేంద్రం ఓకే..
Canada – Immigration Policy | విదేశీ పర్యాటకుల ‘వర్క్ పర్మిట్’ నిలిపేసిన కెనడా.. కారణమిదే..!