Group-1 | గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయండి.. టీజీపీఎస్సీని ఆశ్రయించిన అభ్యర్థులు
Group-1 | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ టీజీపీఎస్సీని గ్రూప్స్ అభ్యర్థులు ఆశ్రయించారు.
Group-1 | హైదరాబాద్ : గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ టీజీపీఎస్సీని గ్రూప్స్ అభ్యర్థులు ఆశ్రయించారు. ఈ మేరకు టీజీపీఎస్సీ అధికారులకు అభ్యర్థులు లేఖ అందజేశారు. పలు అంశాల మీద అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని కోరారు.
గ్రూప్-1 పిలిమినరీ పరీక్ష కీలో దొర్లిన తప్పులపై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారని లేఖలో గుర్తచేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఆ కేసులన్నింటినీ మెయిన్స్ పరీక్ష నాటికి పరిష్కరించాలని, లేనిపక్షంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షను వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశారు. టీజీపీఎస్సీ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించినవారిలో గ్రూప్-1 అభ్యర్థులు చంద్రమౌళి, వినోద్‌కుమార్, కిరణ్, సంపత్ తదితరులు ఉన్నారు.

Group 1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

