ఆదిలాబాద్ : దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా వ్యాన్ బోల్తాపడి(Van overturns) 40 మందికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad) జిల్లా నార్నూర్ మండలం మాలే బోర్గావ్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నార్నూర్ మండలానికి చెందిన గిరిజనులు కెరమెరి మండలం కపిలాయి దైవ దర్శనానికి వ్యాన్‌లో బయలుదేరుతుండగా ప్రమాదం జరిగింది. ఓ మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. 30 మందిని నార్నో ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందించగా మరో పదిమందిని ఆదిలాబాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..