Padi Kaushik Reddy | గోదావరి నీళ్లను వెంటనే లిఫ్ట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ రైతుల పక్షాన మేం డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఏవిధంగా ఉంటదనేది చెప్పేందుకు .. ఈ రోజు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్దదైన, అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను కట్టారని అన్నారు. ఎందుకంటే కేసీఆర్ రైతు బిడ్డ, వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి రైతు ఆవేదన తెలుసు కాబట్టి.. ఇవాళ కేసీఆర్ దుక్కి దున్ని సాలు వేస్తరు కాబట్టే కాళేశ్వరం నీళ్లనేవి ఎంత ముఖ్యమో కేసీఆర్‌కు తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి భూదందాలు చేస్తూ భూములు కొని అమ్ముతడు కాబట్టి మీకు ఆ రైతుల విలువ అర్థమవుతలేదన్నారు.
నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసురుతున్నా. మా పార్టీలో ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసన సభ్యులం ఉన్నం. మీరు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేయండి.. ఏ ఒక్క ఇంచ్ అయినా అన్నారం కానీ, సుందిళ్ల బ్యారేజీలకు కానీ సమస్య వస్తే మేము 28 మంది రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా మేం చేయం. మీ ఇద్దరికీ ఈ సవాల్ ఒప్పుకోవడానికి దమ్ముందా..? అని పాడి కౌశిక్ రెడ్డి అడిగారు.
మేం 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటం. కొంతమంది అన్నారం, కొంతమంది సుందిళ్ల బ్యారేజీ దగ్గరు కూర్చుంటం. రండి చూద్దాం. మీరు కేవలం రైతులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఉన్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్
కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయండి.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమాత్రం చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలము అందరం రాజీనామా చేస్తాము
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి… pic.twitter.com/QW6H3HRH39
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2026
Read ALso :
Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి భూమికి
Watch: కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై రైల్వే వివరణ
Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచిన నైలా గ్రేవల్ !