e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 12, 2021
Advertisement
Home టాప్ స్టోరీస్ రాష్ట్రంలో కొత్తగా 2 వేల కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2 వేల కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2 వేల కరోనా కేసులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసులు 3,18,704కు చేరాయి. ఇందులో 1741 మంది మరణించగా, 3.03 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు కూడా అధికమవుతున్నాయి. మొత్తం కేసుల్లో ప్రస్తుతం 13,362 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 8263 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 398, మేడ్చల్‌ జిల్లాలో 214, రంగారెడ్డిలో 174, నిజామాబాద్‌లో 169 చొప్పున ఉన్నాయి. కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 87,332 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

కరోనా ప్రమాద ఘంటికలు.. 24 గంటల్లో 1.26లక్షల కేసులు
100 కోట్ల ఖ‌రీదైన గ‌స్తీ నౌక‌ను గిఫ్ట్ ఇవ్వ‌నున్న భార‌త్‌
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్ర‌స్ మార్చ‌డ‌మెలా
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారుల‌కు క‌రోనా‌‌
కోవిడ్‌తో ఎక్కువ‌వుతున్న డిప్రెష‌న్‌, మ‌తిమ‌రుపు కేసులు
ఏజెంట్‌గా అఖిల్ లుక్ అదిరిపోయిందంతే..!
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్‌
మ‌రోసారి రాజ‌మౌళి ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం..!

Advertisement
రాష్ట్రంలో కొత్తగా 2 వేల కరోనా కేసులు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement