అక్కినేని అఖిల్ మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే చిత్రాన్ని చేయగా, ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్నుచిత్రాల తర్వాత అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ఫ్యాన్స్‌ను తప్పక అలరిస్తుందని అంటున్నారు. జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు ఆ మధ్య అఫీషియల్ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవితో సైరా నరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత సురేందర్ రెడ్డి ఇప్పుడు అఖిల్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు అఖిల్ బర్త్ డే సందర్బంగా చిత్ర టైటిల్‌తో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఏజెంట్ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.