కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. ప్రధాని తన మొదటి డోసు తీసుకున్న 37 రోజుల తర్వాత రెండో డోసు వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండో విడుత ప్రారంభమైన మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు. హైదరాబాదీ కంపెనీ భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ వేయించుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా.. ‘నేను ఎయిమ్స్‌లో ఈరోజు కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నాను. కరోనా వైరస్‌పై జయించడానికి ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. అర్హులైనవారు వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ కోసం CoWin.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీకి ఇద్దరు నర్సులు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వారిలో మొదటి డోసు ఇచ్చిన సిస్టర్ పీ. నివేదిత, నిషా శర్మ ఉన్నారు. నివేదిత పుదుచ్చేరికి చెందినవారుకాగా, నిషా శర్మ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. దేశంలో ఇప్పటివరకు 9 కోట్లకుపైగా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
సెకండ్‌వేవ్‌లో కొత్త లక్షణాలు
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
మిసెస్ శ్రీలంక పోటీలో వివాదం.. రన్నరప్‌కు విన్నర్ టైటిల్
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో మరో కీలక నిర్ణయం..బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరంటే!
కోవిడ్‌తో ఎక్కువవుతున్న డిప్రెషన్, మతిమరుపు కేసులు
రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు
ఎందుకీ లాక్డౌన్లు?
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

