నెల రోజుల్లోనే.. 79 వేల మంది చిన్నారులకు కరోనా
చిన్నారులకు కరోనా | సెకండ్ వేవ్‌లో మాత్రం చిన్నారులపై కోరలు చాచి బుసలు కొడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 79,688 మంది చిన్నారులకు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గతేడాది ఈ మహమ్మారి పెద్దలపై విరుచుకుపడగా, సెకండ్ వేవ్‌లో మాత్రం చిన్నారులపై కోరలు చాచి బుసలు కొడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 79,688 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మార్చి 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ర్టలోనే 60,684 మంది చిన్నారులకు కరోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9,882 మంది ఉన్నట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 5,940 మంది పిల్లలకు కరోనా వ్యాప్తి చెందగా, 922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు. కర్ణాటకలో 7,327(ఐదేళ్ల లోపు చిన్నారులు 871), ఉత్తరప్రదేశ్‌లో 3,004(ఐదేళ్ల లోపు చిన్నారులు 471) మంది పిల్లలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి ఉందని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఢిల్లీలో 2,733 మంది పిల్లలు కరోనా బారిన పడగా, ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారు. అయితే కరోనా సోకిన చిన్నారుల్లో అత్యధికులు పేదరికం నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇక చిన్న పిల్లలకు ఆస్ర్టాజెనీకా టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాని వల్ల చిన్నారుల్లో బ్లడ్ క్లాటింగ్ అవుతుండటంతో ఆ టీకాను నిలిపివేశారు. యూరప్‌లో ఈ టీకా తీసుకున్న చిన్నారుల్లో ఏడుగురు చనిపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

