మహబూబ్ నగర్ : అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదన్నారు. తల్లి ప్రేమ ఎంతో స్వచ్ఛమైందన్నారు. తల్లి నుంచి ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నోసుగుణాలను మనం నేర్చుకుంటామన్నారు.
మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టి, అమలు పరుస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు మంత్రి. మాతృ దినోత్సవం సందర్భంగా మంత్రి తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్
భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత