భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత
క్రైం న్యూస్ | అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల నల్లబెల్లం, రెండు క్వింటాళ్ల పటికను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

మహబూబాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల నల్లబెల్లం, రెండు క్వింటాళ్ల పటికను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి మీడియాకు వెల్లడించారు. భారీగా నల్ల బెల్లం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు తెల్లవారు జామున 5 గంటల సమయంలో సిరోల్ ఎస్ఐ రాణా ప్రతాప్ తన సిబ్బందితో కాంపల్లి బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
ఖమ్మం వైపు నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఏపీ 16 టి వై (72 68) లారీని ఆపి తనిఖీ చేయగా సుమారు 100 క్వింటాళ్ల నిషేధిత నల్ల బెల్లం, 2 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నారు.
లారీ డ్రైవర్ తో పాటు పెనుగొండ పుల్లారావు, వాంకుడోత్ నరేందర్, వాంకుడోత్ వీరేందర్, వాంకుడోత్ వీరన్న, వాంకుడోత్ గణేష్, మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు.

నల్ల బెల్లం పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో మహబూబాబాద్ టౌన్ సీఐ వెంకటరత్నం, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు కరోనా పాజిటివ్
తాండూరులో కొవిడ్ కేర్ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

