మంగళవారం 26 మే 2020
Telangana - May 14, 2020 , 19:14:44

అకాల వర్షంతో ఆగమాగం

అకాల వర్షంతో ఆగమాగం

హైదరాబాద్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.  అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆదిలాబాద్  నార్నూర్ మండలం లో భారీ గాలులతో కురిసిన వర్షానికి  ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు నేలకూలాయి. కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోనూ కురిసిన  వర్షంతో పంట నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిలో కరెంటు స్తంభాలు నేలకూలాయి. అలాగే మహబూబాబాద్ జిల్లాలో చిరు జల్లులు కురిశాయి.

          


logo