Volvo Bus | నారాయణపేట : కర్ణాటకలోని రాయచూర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. గొర్రెలపైకి వోల్వో బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో 150 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
మహారాష్ట్రకు చెందిన వోల్వో బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా రాయచూర్ వద్ద గొర్రెలపైకి దూసుకెళ్లింది. దీంతో 150 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. మరో 25 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజాము 3.30 గంటలకు చోటు చేసుకున్నట్లు గొర్రెల యజమానులు తెలిపారు. గొర్రెల యజమానులు అనంతమ్మ, పూజారి శ్రీనివాస్.. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందినవారు. నారాయణపేట పట్టణానికి చెందిన మల్లేశ్ గొర్రెలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
Current Charges | త్వరలో కరెంట్ షాక్! నూతన సంవత్సర కానుకగా విద్యుత్తు చార్జీల పెంపుదల తప్పదా?
RRR | ఆమనగల్లుకు 300 ఫీట్ల రోడ్డు..? భారీ రియల్ఎస్టేట్ ప్రయోజనాలు దాగి ఉన్నాయా..?