రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షణీయం
బోయినపల్లి వినోద్ కుమార్ | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప చారిత్రక కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప చారిత్రక కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయని ఆయన తెలిపారు. 2018లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అంతేకాకుండా నిరంతరంగా రామప్ప చారిత్రక ప్రాధాన్యం గురించి కేంద్రాన్ని గుర్తు చేసిన సీఎం కేసీఆర్ ప్రయత్నాలకు ఫలితం దక్కిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు పాపారావు, పాండురంగారావు, తదితరులు కూడా రామప్ప కు యునెస్కో గుర్తింపు కోసం ముమ్మరంగా కృషి చేశారని ఆయన తెలిపారు. 2013లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు మార్లు రామప్ప 800 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరినా లాభం లేకపోయిందన్నారు.
1213 సంవత్సరం నాటి రామప్ప చారిత్రక కట్టడాలకు ఎట్టకేలకు యునెస్కో గుర్తింపు లభించడం పట్ల వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
విషాదం : రెండంతస్తుల భవనం పైనుంచి పడి బాలుడు మృతి
ప్రారంభమైన అంతర్రాష్ట్ర రాకపోకలు
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
పిజ్జాలంటే ఇష్టమన్న మీరాబాయి.. జీవితకాలం ఫ్రీగా ఇస్తామన్న డొమినోస్
చేపల వేటకి వెళ్లి వ్యక్తి గల్లంతు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

