వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మానుకోటలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం మహబూబాబాద్ మండలం అమనగల్, బలరాంతండా, శనిగపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు షర్మిల పాదయాత్ర కొనసాగింది.
‘ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందులలో ఓటు వేసి తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు.. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణలో ప్రశ్నిస్తున్నావా?’ అంటూ వైఎస్ షర్మిలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి ఆ నాటి ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోన