Revanth Reddy | టీఆర్ఎస్ పుట్టకముందే కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం నడిపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిన్నారెడ్డిని ఇరకాటంలో పడేశాయి. చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి వరకు తెలంగాణకు ద్రోహం తలపెట్టిన వారేనన్న ఆరోపణ ఉంది. తెలంగాణకు మద్దతివ్వని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రను అప్పట్లో సైమన్ కమిషన్‌తో చిన్నారెడ్డి పోల్చారు. అయితే అదే చిన్నారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వైఎస్ మంత్రివర్గంలో చేరారు.
మంత్రి పదవి కోసం తెలంగాణకు ద్రోహం చేశారన్న అపవాదు చిన్నారెడ్డిపై పడింది. ఎప్పుడో మరుగున పడిన విషయాన్ని రేవంత్‌రెడ్డి తిరిగి గుర్తు చేయడంలో ఆంతర్యం ఏమిటనీ చిన్నారెడ్డి సన్నిహితులు వాపోతున్నారు. టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డికి తన వ్యతిరేకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయమని రేవంత్‌రెడ్డి చెప్పినా వినిపించుకోలేదన్న కోపంతోనే పాత విషయాలను తిరగదోడి బద్నాం చేసే కుట్ర ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.