ఒక పదునైన మాట పది దెబ్బలతో సమానం. అందుకే పిల్లలకు మాట్లాడటం నేర్పించమని చెబుతారు జానపదులు. మాట్లాడ నేర్పించడం అంటే.. ‘అమ్మా.. ఆవు, ఇల్లు.. ఈగ’ కాదు. సమాజం గురించి నేర్పించడం. తెలివిగా వ్యహరించేలా, నలుగురినీ మ�
ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ, తెలివితో వ్యవహరిస్తే.. ఏ పనైనా సులువేనని అనుభవపూర్వకంగా చెప్పారు మన పెద్దలు. ఇకమతు లేనోన్ని ఇగురం ఉన్నోనితో పోల్చుతూ నాడు జానపదులు చెప్పిన సామెత ఇది.
‘మాకు ఉన్నది ఇద్దరే పిల్లలు. చిన్నది కూడా ఈడుకొచ్చింది. మీకెలాగూ ఇద్దరే కాబట్టి ఒకేసారి ఒకే రోజున కుండమార్పిడి పెండ్లి జేత్తం. అట్లయితనే మాకు కుదుర్తది. లేకపోతే మీ ఇష్టం’ అటుంటారు పెండ్లి సంబంధాలు మాట్ల�
పూర్వం నుంచీ అల్లుడంటే అపార గౌరవం, ఎంతో మర్యాద. మన ఆడబిడ్డను ఇస్తాం కాబట్టి, ‘ఇంటికొచ్చిన అల్లుణ్ని సరిగ్గా చూసుకోకపోతే.. రేపు కూతుర్ని ఏమైనా అంటడేమో అనే భయం.
భవిష్యత్ ప్రణాళిక, కుటుంబాన్ని సాకే విధానం తెలియని వ్యక్తులను ఉద్దేశించిన సామెత ఇది. ఈ తరహా వ్యక్తులు అప్పటికప్పుడే అన్నట్టు ప్రవర్తిస్తారు. చేతినిండా డబ్బు ఉంటే ‘తనంత ధీరుడు లేడు’ అంటూ గొప్పలకు పోతార�
అతి ఎప్పుడూ అనర్థానికే దారితీస్తుంది. అందుకే ‘అతిక సవాసం మోసం’ అని జానపదులు చెబుతుంటారు. అతి అంటే ఎక్కువ అని, సోపతి/సహవాసం/సవాసం అంటే స్నేహం అని అర్థం.
ఇది వ్యవసాయ సంబంధమైనదే అయినా.. అన్ని కాలాల్లోనూ, అన్ని వయసుల వారికి వర్తించేలా వాడుతారు. ఎవరి శక్తిసామర్థ్యాలు ఎలాంటివన్నది చిన్నప్పుడే తెలుస్తాయంటూ జానపదులు సృష్టించిన సామెత ఇది.