కొందరు అమ్మాయిలు సన్నగా, పొడుగ్గా, నాజూగ్గా, అందంగా, ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఆటపాటల్లో, పనుల్లో మాత్రం వారి ప్రతిభ శూన్యం. అలాంటి వాళ్లు తారసపడినప్పుడు ‘చూపుల గుర్రమే.. చేతల గుర్రం కాదు’ అంటుంటారు వ్యంగ్యంగా. బాహ్యమైన ఆకారాన్ని బట్టి ఎదుటి మనిషి సమర్థతను అంచనా వేయకూడదని ఈ పదబంధం సారాంశం.