‘మాకు ఉన్నది ఇద్దరే పిల్లలు. చిన్నది కూడా ఈడుకొచ్చింది. మీకెలాగూ ఇద్దరే కాబట్టి ఒకేసారి ఒకే రోజున కుండమార్పిడి పెండ్లి జేత్తం. అట్లయితనే మాకు కుదుర్తది. లేకపోతే మీ ఇష్టం’ అటుంటారు పెండ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు. ఈ పదబంధంలో ‘కుండ మార్పిడి’ అంటే కుండలు మార్చుకోవడం కాదు. కుండ అంటే స్త్రీ అని అర్థం.
గతంలో పేదరికం వల్లనో, ఆర్థిక ఇబ్బందుల వల్లనో కుండమార్పిడి పెండ్లిళ్లు బాగా జరిగేవి. ఒక కుటుంబంలోని అన్నా చెల్లెళ్లను, మరో కుటుంబంలో అన్నాచెల్లెళ్లకు ఇచ్చి పెండ్లి చేయడాన్ని కుండమార్పిడి పెండ్లిగా అభివర్ణిస్తారు. తెలుగు రాష్ర్టాల్లో నేటికీ ఈ సంప్రదాయం కనిపిస్తుంది.