ఎద్దయ్యేది ల్యాగున్నప్పుడే తెలుస్తది
ఇది వ్యవసాయ సంబంధమైనదే అయినా.. అన్ని కాలాల్లోనూ, అన్ని వయసుల వారికి వర్తించేలా వాడుతారు. ఎవరి శక్తిసామర్థ్యాలు ఎలాంటివన్నది చిన్నప్పుడే తెలుస్తాయంటూ జానపదులు సృష్టించిన సామెత ఇది.
ఇది వ్యవసాయ సంబంధమైనదే అయినా.. అన్ని కాలాల్లోనూ, అన్ని వయసుల వారికి వర్తించేలా వాడుతారు. ఎవరి శక్తిసామర్థ్యాలు ఎలాంటివన్నది చిన్నప్పుడే తెలుస్తాయంటూ జానపదులు సృష్టించిన సామెత ఇది. ఆవు కడుపునుంచి పుట్టిన దూడ (ల్యాగ) పెరిగిపెద్దయ్యే కొద్దీ వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుందా? లేదంటే బద్ధకించి పని తప్పించుకుంటుందా? తిని పడుకోవడానికే పరిమితం అవుతుందా? తెల్లగొడ్లు (ఆవులు, ఎద్దులు) పొలాలు దున్నుతుంటే ఆ సాళ్లలో తిరుగుతూ ఎవుసాన్ని గమనిస్తుందా? లేదా? అని వాటి యజమానులు నిత్యం గమనిస్తూ ఉంటారు.
ఆయా అంశాల ఆధారంగానే దాని భవిష్యత్తును తేలుస్తారు. ఎవుసానికి ఉపయోగపడేట్లు ఉంటే కోడె వయసు రాగానే సాగేస్తారు. అప్పుటికి కూడా రంకెలేస్తూ.. యజమాని మాట వినకపోతే ఎవుసానికి పనికిరాదని నిర్ధారిస్తారు. అలాగే పిల్లల ప్రవర్తన, చదివే విధానం, తెలివి తేటలను బట్టి కూడా పెద్దలు ఓ నిర్ణయానికొస్తారు. ఏదైనా తేడా వస్తే.. ‘ఎద్దయ్యేది ల్యాగున్నప్పుడే తెలుస్తది. అప్పుడు తెలిసినా కూడా దారిలో పెట్టకపోవడం మీదే తప్పు’ అని యజమాని/తల్లిదండ్రులను ఎదురు ప్రశ్నిస్తుంది సమాజం.
డప్పు రవి
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

