రంధి = దిగులు (ఎందుకమ్మా గింతదానికే అంత రంధిపడుతున్నవ్. ఇయ్యాల తిట్టినోడు రేపు నిన్ను మంచిగ ఏలుకోడా?
రంధి మానుకొని కొద్దిగంత ఎంగిలిపడు)
అంత్రం = అంతరం, అంతస్తు (రేయ్ మల్లిగా.. సిన్నంత్రం పెద్దంత్రం లేకుండా ఒర్లుతున్నవ్. దీనికి పదింతలు అనుభవిస్తవ్ బిడ్డా!)
కువ్వారుకం = మోసపూరితం/కుట్ర/ కుతంత్రం (నిన్ను ఎంతగానో నమ్మినా బిడ్డ. నువ్ మాత్రం నీ మనసుల కువ్వారుకం వెట్టుకొని, నలుగిట్ల నవ్వులపాల్జేస్తివి)
పాతాళగరిగె = నలువైపుల కొక్కేలు ఉన్న పనిముట్టు. బావులు, కుంటలు, చెరువుల్లో ఉపయోగిస్తారు.
(ఎన్నిబిందెలు బాయి పాల్జేత్తవ్రా. గుమ్మిసందున పాతాళగరిగె ఉంది పట్టకరా పో.. దాన్ని లోపలేసి తిప్పితే కొత్తయి, పాతయన్ని బయటికొత్తయ్)
ఇంగలం = అంగారం, నిప్పు (చుట్టమీదికింత ఇంగలం తెచ్చియ్యి బిడ్డా.. మాపటిసంది కుతి గుంజుతాంది)