మనసు పిచ్చిదమ్మ మరుల నూహించుక ధైర్యమును వహించు తగరు వోలె వాని కించుకైన వలపు నీ పైనను కలదొ? లేదొ? తెలియవలదె మగువ! (ఓ మగువా! నీ మనసు పిచ్చిది! ఏదో ప్రేమను ఊహించుకొని పొట్టేలులా ధైర్యం వహిస్తున్నది. మరి వానికి న
హఠాత్తుగా గుమ్మంలో ప్రత్యక్షమైన ఈసాణుడిని చూసి ముగ్గురూ కంగారుపడ్డారు. ఆ ముగ్గురు.. దేవి, సుద్ది, అవణాయరు. అవణాయరు, దేవి ఏదో గుసగుసలాడుతూ ఉంటారు. కొద్దిదూరంలో వంటకు ఏర్పాటు చేసుకుంటూ వీళ్లను ఓ కంట కనిపెడు�
వారం రోజులుగా ఈసాణుడికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్' అన్నట్లు; ‘దుర్మార్గేవ విజనాతి దుర్మార్గస్త్య ప్రతిక్రియమ్' కదా! తన చుట్టూ ఏదో కుట్ర జరుగుతున్నట్లు అతనికి అ
జరిగిన కథ: ఆనందుణ్ని తాను ఎందుకు ఆదరిస్తున్నదో ఆహవకు అర్థమయ్యేటట్లు చెబుతుంది కమలసత్తి. రోహా బతికే ఉన్నదన్న విషయం ఆమె తల్లిదండ్రులకు నమ్మకంగా చెబుతాడు పరమేశ్వర శాస్త్రి.
తనను నిలదీసిన ఆహవకు గట్టి సమాధానం ఇచ్చింది కమల సత్తి... “నీవు అడిగిన ప్రశ్నకు, అడిగిన తీరుకు నీ చెంప పగులగొట్టే అధికారం, పెద్దరికం నాకున్నాయి. అయి నా నేను కొట్టను. అందుకు కారణం మా మీద చెరగని ప్రేమాభిమానాలతో �
చిలుకవాడ భూగృహం... క్షణంలో తేరుకొని.. వోహా, ససిప్పహా ఇద్దరూ ఒక్కసారిగా చంద్రహత్థి మీదికి దూకినంత పని చేసినారు. అప్పటికే పూర్తి స్పృహలోకి వచ్చిన చంద్రహత్థి ఏమాత్రం బెదరలేదు. “నీవు ఆడదానివే కదా!?” సూటిగా చూస్
లోపలికి వెళ్లిన ప్రణాలుని రాకకోసం బయటి నుండే నిరీక్షిస్తూ సోకులను సవరించుకుంటున్న భాణుసత్తి మనసు మనసులో లేదు. కనుల నిండా ప్రణాలుడే ఉన్నాడు. ఎన్నడూ సరిగ్గా చూడనైనా లేని మగని కన్నా, కనుల నిండుగా చూసుకోగలి
“ఈసాణుడితో వైరం పెంచుకోవడం కన్నా, స్నేహం నటించడమే ప్రస్తుతం అనుసరించదగిన పద్ధతి” బాగా ఆలోచిస్తూ అన్నది సవరసత్తి. “కానీ వాడు నమ్ముతాడా? మంచి వాళ్లను, అమాయకులను నమ్మించడం తేలిక! దుర్మార్గులను, వంచకులను అం�
హఠాత్తుగా అటువైపు నుంచి వస్తున్న ఈసాణుడి మీద సౌగంధిక దృష్టి పడింది. ఒక్కక్షణం ఏం చేయాలో తోచలేదు ఆమెకు. ఇంతకాలం ఎవరిని తప్పించుకొని తిరుగుతున్నదో, వాణ్నే వెతుక్కుంటూ వచ్చినట్లయింది. ఇప్పటికిప్పుడు వెను�
“పక్కకు తప్పుకోండి సామీ!” అడ్డంగా నిలబడిన ఆసామిని చూసి చిరుకోపంతో అన్నది ఆహవసత్తి. “అరే! నా పేరు నీకెట్లా తెలుసు సుందరీ! అయినా పక్కకు తప్పుకొమ్మంటున్నావు. ఎవరి పక్కకు? నీ పక్కకా? మీ అక్క పక్కకా?” ‘పక్క’ అనే �
జంగిటిలో.. భాణుసత్తి, ఆహవసత్తి నవ్వుతూ.. మాట్లాడుకుంటూ పొలాల వైపు వెళుతున్నారు. వాళ్లకు తెలియకుండా సచ్చసామి అనుసరిస్తున్నాడు. అది వాళ్లు గమనించకుండా ముందుకు చూస్తూ నడుస్తున్నారు. అప్పుడు వాళ్లకు అటుగా వ�
(ఆ అడవిలో వరుసగా ఉన్న మోదుగు చెట్లు తమ లేత ఎరుపు రంగులో ఉన్న పువ్వులను కుప్పలుగా రాల్చినాయి. అవి చూపరులకు కాషాయాంబరధారులైన బౌద్ధ బిక్షువులు బుద్ధ దేవుని చరణాలమీద వాలినారా అనిపిస్తున్నాయి) పట్టరాని ఆనందం
“భయపడనవసరం లేదు! నేను సవరను!” భూగృహం లోపలికి దిగుతూ తన ఉనికిని ప్రకటించింది సవరసత్తి. ముగ్గురూ ఆమె కోసమే ఎదురు చూస్తున్నారు. ఆమె రాక.. వాళ్ల మనసులను తేలికపరచింది. నెగడు పెద్దగా చేసినాడు పోటిసుడు. సవరసత్తి, �
మనిషిని చంపినంత తేలిక కాదు పామును చంపడం! ఖడ్గం కదిలించేలోపు కాటేసేటంత చేరువలో ఉన్నది ఆ సర్పం! మరొకపక్క పక్కటెముక గాయానికి సంబంధించిన నొప్పి ఇబ్బంది పెడుతున్నది. ‘విజయమో! వీర స్వర్గమో!’ అని తెగించేటంత సాహ�