వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ | ఏపీలో వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ఓ ప్రత్యేక యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానున్నది.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు | రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
గురుమూర్తి హిందువా.. కాదా.? | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువా? కాదా..!? స్పష్టంగా చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
ఏపీలో కరోనా | ఏపీలో ఇవాళ కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,606 మంది చికిత్సకు కోలుకున్నారు. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
భృంగివాహనంపై ఆది దంపతులు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రబాబు ఎన్నికల ప్రచారం | తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నెల్లూర్ జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీ సీఎం జగన్పై ఫిర్యాదు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.