భృంగివాహనంపై ఆది దంపతుల వైభవం
భృంగివాహనంపై ఆది దంపతులు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగాయి. సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్పమూర్తులను భృంగివాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భృంగివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను దర్శించుకొని భక్తులు తరలించారు. భృంగివాహనంపై ఆశీనులైన ఆదిదపంతులను దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని, పనుల్లో ఏకాగ్రత లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి.

మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు
కన్నడిగుల ఇలవేల్పు శ్రీభ్రమరాంబ అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో విశేష పూజలు అందుకుంది.
ఈ అలంకరణలో చతుర్భుజాలు కలిగి పైరెండు చేతుల్లో పద్మాలు, కుడివైపు
అభయ హస్తం, ఎడమవైపు వరముద్రతో దర్శనమిస్తుంది.
ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే శత్రుబాధలు తొలగి.. సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
వాహన పూజల అనంతరం ఆలయ ప్రధాన రాజగోపురం నుంచి బయలు వీరభద్రస్వామి వరకు స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండగగా సాగింది.
గ్రామోత్సవంలో మహిళల కోలాటం, జానపద కళాకారులపగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఈఓ కేఎస్ రామారావుతోపాటు ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్, ఏఈఓలు మల్లయ్య, హరిదాస్, కృష్ణారెడ్డి, డీఈలు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, రెవెన్యూ అధికారి శ్రీహరి, పర్యవేక్షకులు ఉమేశ్ పట్వారీ, హిమబిందు అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

