Naresh | ‘హే భగవాన్’ ఈవెంట్లో చీరలపై నరేష్ కామెంట్స్ ..సోషల్ మీడియాలో మళ్లీ వివాదం
Naresh | టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన పాల్గొన్న హే భగవాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ కార్యక్రమంలో మహిళలు చీరలు ధరించడం గురించి ఆయన చేసిన కామెంట్స్‌కు మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
Naresh | టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన పాల్గొన్న హే భగవాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ కార్యక్రమంలో మహిళలు చీరలు ధరించడం గురించి ఆయన చేసిన కామెంట్స్‌కు మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. సంప్రదాయ దుస్తుల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ నరేష్ మాట్లాడిన తీరు కొందరికి నచ్చగా, మరికొందరు విమర్శిస్తున్నారు.యువ హీరో సుహాస్, హీరోయిన్ శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదల వేడుకలో నరేష్ మాట్లాడుతూ వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా ఆ రోజు “హగ్ డే” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉన్న అందరికీ హగ్ ఇచ్చానని, కానీ చీరలో ఉన్న మహిళలకు హగ్ ఇవ్వడం సరైనది కాదని అన్నారు. ఈ మధ్య ఈవెంట్లకు చాలా మంది మహిళలు చీరలు ధరించి రావడం మంచిదని, అది మన సంప్రదాయమని వ్యాఖ్యానించారు. హగ్ ఇవ్వడం మన సంస్కృతి కాదని చెప్పడం అక్కడున్న వారిలో నవ్వులు పూయించినప్పటికీ, ఈ వ్యాఖ్యలు ఆన్లైన్లో వివాదానికి దారి తీశాయి.నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు సమర్థిస్తూ సంప్రదాయ దుస్తులకు ప్రోత్సాహం ఇవ్వడం తప్పుకాదని అంటుండగా, మరికొందరు మాత్రం మహిళల దుస్తుల ఎంపిక పూర్తిగా వ్యక్తిగత విషయం అని అభిప్రాయపడుతున్నారు.
పబ్లిక్ ఈవెంట్లో అలాంటి వ్యాఖ్యలు అవసరమా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. ఇటీవలే దుస్తుల విషయంలో సోషల్ మీడియాలో జరిగిన చర్చల నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, మరోసారి అలాంటి వ్యాఖ్యలు రావడం సమంజసం కాదని విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా ఒక చిన్న వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తూ, ‘హే భగవాన్’ సినిమా కంటే ఈ వివాదమే ఎక్కువగా హైలైట్ అవుతోంది. మరి ఈ వివాదం ఎలా చల్లారుతుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

