Bollam Mallaiah Yadav | కోదాడ, నవంబర్ 16 : కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక స్నేహభావం పెంపొందుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమారాధనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సమిష్టి బాధ్యతతో సమస్యలు పరిష్కరించుకోవాలని, తమ సామాజిక వర్గంలో నిరుపేద వర్గాలకు చేయూతనివ్వాలని బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన సంఘ సభ్యులను ఆయన అభినందించారు. పద్మశాళి సంఘ బలోపేతానికి, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని.. అన్ని వేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా కమ్మ కాకతీయ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధనలో ఎమ్మెల్సీ తొండపు జనార్ధన్, తుమ్మల యుగంధర్లను మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు, కమ్మ సామాజిక వర్గ పెద్దలు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
Akhanda 2 | నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. 3డీ ఫార్మాట్లో ‘అఖండ 2’
Rajkummar Rao | తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ దంపతులు
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!