Akhanda 2 | నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2’ (Akhanda 2). ఈ మూవీ గురించి చిత్ర బృందం సినీ అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ను అందించింది. తాజాగా నిర్వహించిన ‘అఖండ 2’ బిగ్ రివీల్ ప్రెస్మీట్లో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… ఈ సీక్వెల్‌ను సాధారణ 2డీ వెర్షన్‌తో పాటు 3డీ ఫార్మాట్లో (Akhanda 2 in 3D) కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే గొప్ప అనుభూతిని పంచే సినిమాల్లో ‘అఖండ 2’ ఒకటిగా నిలవనుంది. 3డీ ఫార్మాట్లో ఈ సినిమాను చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అని టీమ్ ధీమా వ్యక్తం చేసింది. బోయపాటి మార్క్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు 3డీలో మరింత అద్భుతంగా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, గతంలో సంచలనం సృష్టించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
EXPERIENCE THE DIVINE ROAR OF #Akhanda2 in 3D 💥💥🤩
Mark our words. This will be one of the greatest movie watching experiences in Indian Cinema ❤️🔥❤️🔥#Akhanda2 IN CINEMAS WORLDWIDE FROM DECEMBER 5th.#Akhanda2Thaandavam
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu… pic.twitter.com/FEEECSayzG— 14 Reels Plus (@14ReelsPlus) November 16, 2025