Rain Alert | రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో(Telangana) పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో అతాలకుతలమైన రైతులకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో(Telangana) పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో అతాలకుతలమైన రైతులకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణలో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు(Heavy rains )పడే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్నిచోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా, అకాలవర్షంతో రైతులు అతలాకుతలం అయ్యారు. పలుచోట్ల వివిధ రకాల పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో 8.7, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 16.1, మంచిర్యాల జిల్లాలో 9.6, నిర్మల్ జిల్లాలో 0.2 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆయా జిల్లాల్లో అకాల వర్షాలు పత్తి, పుచ్చ, మామిడి, జొన్న, బొప్పాయి, వరి పంటలను దెబ్బతీసింది. రైతులు కల్లాలు, ఇండ్లలో ఆరబోసుకున్న పెసర, పసుపు పంటలు తడిసిపోయాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండురోజులపాటు కురిసిన అకాల వాన అపార నష్టాన్ని తెచ్చి పెట్టింది. వీణవంక మండలంలో 50 మంది రైతులకు చెందిన 260 ఎకరాల్లో మక్క నేలకొరిగింది.
శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామంలో చింతిరెడ్డి ఆదిరెడ్డి ఇంటి సమీపంలో కొబ్బరి చెట్టుపై భారీ పిడుగుపడి, మంటలు చెలరేగి దగ్ధమైంది. కరీంనగర్ రూరల్ మండలంలో 20 ఎకరాల్లో మక్కకు నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం, వెన్నంపల్లి, గంగారం, మంగపేట గ్రామాల్లో సుమారు 500 ఎకరాల మక్క పంట నేలకొరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వివిధ పంటలు దెబ్బతిన్నాయి. కొందుర్గు మండల కేంద్రంలో మక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని మండలాల్లో చేతికొచ్చిన మక్కజొన్న నేలవాలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన మక్కజొన్న, మిర్చి తడిసిపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

