KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు కేసీఆర్( KCR ) పరాభవ నామ ఉగాది పండుగ( Ugadi Festival ) శుభాకాంక్షలు తెలిపారు. రైతు నామ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలి అని ఆకాంక్షించారు. రాష్ట్రప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు పరాభవం చెంది, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలన్నారు. మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలన్నారు. రాష్ట్రం పునర్వైభవం సంతరించుకొని తెలంగాణతో పాటు దేశం మరింత అభివృద్ధి సాధించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
Rain Alert | రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
Bhadrachalam | నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు