Patralekhaa | బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు, ఆయన సతీమణి పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. శనివారం నాడు పత్రలేఖ పండంటి పాపకు జన్మనిచ్చింది. తమ నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఈ శుభవార్తను పంచుకుంటూ ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. “మా నాల్గవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఇది. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి” అని పోస్ట్‌లో పేర్కొన్నారు. పాపకు స్వాగతం చెబుతూ పోస్ట్ పెట్టిన రాజ్‌కుమార్, పత్రలేఖ దంపతులకు బాలీవుడ్ సినీతారలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ‘తల్లిదండ్రుల క్లబ్‌లోకి స్వాగతం’ అని కామెంట్లు పెడుతున్నారు. రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ కొంతకాలం పాటు ప్రేమ ప్రయాణం కొనసాగించిన తర్వాత, పెద్దల సమక్షంలో 2021లో నవంబర్ 15న పెళ్లి చేసుకున్నారు.