Bollam Mallaih yadav | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, వారి పాలనకు ప్రజలు విరక్తి చెందారని రానున్నది ఉద్యమనేత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం కోదాడలోని తన నివాసంలో పట్టణ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటిందని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు లేదనే విషయం స్పష్టమైనది అన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ మనదే విజయమని, వార్డుల వారీగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన హితవు పలికారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించాలని శ్రేణులకు సూచించారు. రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఏ సభకు వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని దీంతో కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకుడు సత్యబాబు కర్ల సుందర్ బాబు, మామిడి రామారావు, వెంకట్, చంద్రశేఖర్, మేదర్, లలిత, పిట్టల, భాగ్యమ్మ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Actor Shivaji | హీరోయిన్ల డ్రెస్సులపై కామెంట్స్.. శివాజీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
Thalapathy Vijay | ‘ఇదే నా చివరి సినిమా’.. సినిమాలకు గుడ్ బై చెప్పిన దళపతి విజయ్
Rajendran | గుండు వెనుక విషాద కథ.. అదే రాజేంద్రన్‌కు వరంగా మారిందట!