Producer SKN | టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇటీవల ‘దండోరా’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని ఆగ్రహానికి గురిచేయగా, తాజాగా నిర్మాత ఎస్కేఎన్ (SKN) ఆయనపై ఘాటుగా స్పందించారు.
ఒక సినిమా ఈవెంట్లో పాల్గోన్న ఎస్కేఎన్ వేదికపై ఉన్న హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “తెలుగు అమ్మాయిలు మీకు ఏ డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే అదే వేసుకోండి, ఏది కాన్ఫిడెంట్‌గా ఉంటే దాన్నే ధరించండి. ఎవరో ‘బట్టల సత్తిగాడి’ మాటలు వినాల్సిన అవసరం మీకు లేదు” అంటూ పరోక్షంగా శివాజీకి కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిత్వం అనేది డ్రెస్సుల్లో ఉండదని, మన మనసు మరియు ఇంటెన్షన్ బాగుంటే అంతా మంచే జరుగుతుందని ఎస్కేఎన్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఒక మహిళా నటుడి దుస్తుల గురించి అలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని వారు మండిపడ్డారు. సినీ తారలే కాకుండా సామాన్య మహిళలు కూడా సోషల్ మీడియా వేదికగా శివాజీపై విరుచుకుపడుతున్నారు. ఈ కామెంట్స్ యావత్ మహిళా జాతిని కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“Women, heroines, everyone should wear what they feel like. You should wear what gives you confidence. Don’t listen to any idiots!”, says producer SKN!
How simple and easy is it to be a rationale, decent individual?
All one needs to do is to learn to respect a… pic.twitter.com/xQsM2TXQHG— Revathi (@revathitweets) December 27, 2025