అర్వపల్లి ఏప్రిల్ 20 : మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని జమాయిల్ తోట పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రైతు గుర్రం శ్రీదేవికి చెందిన మూడున్నర ఎకరాల భూమిలో జమాయిల్ తోట అగ్నికి ఆహుతైంది. సుమారు ఐదు లక్షల వరకు నష్టం వాటిలిందని బాధితురాలు తెలిపింది. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితురాలు కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Teff Millets | మీకు తెల్ల రాగుల గురించి తెలుసా.. ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతం..
Rains | రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
J&K Rain | జమ్ముకశ్మీర్లో వరుణ బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. ముగ్గురు మృతి