పండ్లు ప్రకృతి ప్రసాదించిన తీయని కానుకలు. రుతువుకో రుచి, రంగుకో ఆకర్షణ, గింజకో ప్రత్యేకత. రోజూ ఏదో ఒక పండు తిన్నా సరిపోతుంది.. నిండు నూరేండ్లు ఆరోగ్యంగా బతకడానికి. కానీ, ఎప్పుడు ఏ పండు తినాలనే విషయంలోనే కొంత అవగాహన అవసరం.
♥ పండ్లలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువగానే ఉంటాయి. కాబట్టి నిరభ్యంతరంగా ఆరగించవచ్చు. పొటాషియం, విటమిన్-సి, ఫోలేట్లోని సుగుణాలు చాలా మంచి చేస్తాయి.
♥ రోజూ రెండు పండ్లు తినాల్సిందే అన్న నియమం పెట్టుకోవాలి. దీనివల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. మధుమేహానికి దూరంగా ఉండవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌గా పండ్లను ఎంచుకుంటే మరీ ఉత్తమం.
♥ పండ్లు+కొబ్బరి, పండ్లు+మొలకెత్తిన గింజలు, పండ్లు+పనీర్.. కూడా మంచి కాంబినేషన్లే. పండ్లను పాలతోనూ తీసుకోవచ్చు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రం.. సాధారణ పాలతో పోలిస్తే ఆల్మండ్ మిల్క్ ఉత్తమం.
♥ స్వధర్మే నిధనం శ్రేయః.. అన్న గీతా వాక్కును పండ్లకు కూడా అన్వయించుకోవచ్చు. ఎంత ఖరీదైనవి అయినా, ఎన్ని పోషకాలున్నా విదేశీ పండ్లు విదేశీ పండ్లే. స్థానిక ఫలాలను ఎంచుకోవడమే ఉత్తమం.
♥ డైటరీ ఫైబర్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. కానీ, పండ్లరసం రూపంలో తీసుకుంటే మాత్రం ఈ అమూల్యమైన పోషక శక్తిని కోల్పోతాం.
అతి సర్వత్ర వర్జయేత్ అన్న మాట ఇక్కడ కూడా వర్తిస్తుంది. మితిమీరి తినడం అంత మంచిది కాదు. వీటిలోని ఫ్రక్టోజ్ ఊబకాయానికి ఓ కారణం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని పెంచవచ్చు కూడా. కాబట్టి, రెండు పండ్లకు పరిమితమైతే ఉత్తమం.
పుట్టగొడుగులకు (మష్రూమ్స్) శాకాహారుల మాంసాహారమని పేరు. వీటిలో పోషకాలు అపారం. పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం వంటి ఖనిజాలతోపాటు విటమిన్-బి3, బి9, డి పుష్కలంగా ఉంటాయి.
♥ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిలోని హైపోైగ్లెసిమిక్ లక్షణాలు మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు దోహదపడతాయి. రక్తహీనత,
ఊబకాయం వంటి సమస్యలను పరిష్కరించడంలోనూ సాయపడతాయి.
♥ పుట్టగొడుగులు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచి ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలకూ మంచి ఔషధంగా పనిచేస్తాయి.
♥ మెదడు కణాలను ఉత్తేజపరచడంలోనూ ఇవి ప్రభావవంతంగా పనిచేస్తాయి.
♥ విషపూరిత పుట్టగొడుగుల వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు రావచ్చు. అందువల్ల ఎంచుకునేటప్పుడే తగిన జాగ్రత్తలు అవసరం.
బెండకాయ అంటే ఇష్టం ఉన్నా.. జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి, తినేందుకు అంతగా ఇష్టపడరు చాలామంది. కాకపోతే చిట్కాలు పాటిస్తే, జిగురు లేకుండా.. బ్రహ్మాండంగా బెండకాయ కూర వండేయవచ్చు. బెండకాయల్ని ఓ రెండు గంటల ముందే కడిగి ఆరబెట్టాలి. తర్వాతే కోసుకోవాలి. కోసిన ముక్కల్ని కాసేపు ఫ్యాన్ కింద పెట్టి వండితే జిగురు రాదు. తరిగిన ముక్కల్ని కడాయిలో ఒక చెంచా నూనె వేసి, రెండు నిమిషాలపాటు మూత పెట్టకుండా వేయించి వండినా జిగురు ఉండదు. ముక్కలపై కొంచెం నిమ్మరసం లేదా మజ్జిగ చల్లుకున్నా బెండకాయ కూరలో అస్సలు జిగురు కనిపించదు.
ఐస్‌క్రీమ్ పిజ్జా, స్వీట్ డోక్లా, మోమోస్ విత్ ఐస్‌క్రీమ్, పిజ్జా విత్ చాక్లెట్ టాపింగ్.. పేర్లు కొత్తగా అనిపిస్తున్నాయా? ఇవన్నీ రుచుల పరిశ్రమలో నయా ట్రెండ్స్. స్వీట్, హాట్ అన్న తేడా లేకుండా అన్నిటికీ చల్లని ఐస్‌క్రీమ్‌ను జతచేస్తున్నారు. జంక్‌ఫుడ్‌లో వాడే మసాలాతో పోలిస్తే.. చాక్లెట్, ఐస్‌క్రీమ్ వంటి తీపి పదార్థాలు ఆరోగ్యానికి మంచివని తేలడంతో జనం వీటివైపే మొగ్గు చూపుతున్నారు. మితంగా తింటే జీర్ణ సంబంధమైన సమస్యలు, అల్సర్లు వచ్చే ప్రమాదం లేదు. కాకపోతే, మరీ చల్లని రుచులు కొందరికి పడకపోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
చేప ముక్కలు: 8, కొబ్బరి పాలు: ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము: రెండు కప్పులు, కారం: ఒక టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు: ఒక టేబుల్ స్పూన్, ఎండు మిర్చి: నాలుగు, అల్లం: రెండంగుళాల ముక్క, కరివేపాకు: రెండు రెబ్బలు, ఆవాలు: ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, పసుపు: ఒక టీస్పూన్, కొబ్బరి నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత.
దుగా పచ్చి కొబ్బరి తురుముకోవాలి. తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు, పసుపు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు గుజ్జు, కారం, ఎండుమిర్చి, ఉప్పు, సన్నగా తరిగిన అల్లం కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి కొబ్బరి మిశ్రమం, చింతపండు మిశ్రమం వేసి బాగా కలిపి అరలీటరు నీళ్లు, కొబ్బరిపాలు పోసి పది నిమిషాలపాటు మరగనివ్వాలి. మిశ్రమం బాగా మరిగాక కడిగి పెట్టుకున్న చేపముక్కలు వేసి ఐదు నిమిషాలు మూతపెట్టాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టుకుని. కొబ్బరినూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. బాగా ఉడికిన చేపల కూరలో వేయించిన పోపు వేసి దించేస్తే కేరళ స్పెషల్ మలబార్ చేపలకూర సిద్ధం.
శారీరక, మానసిక ఆరోగ్యం పెంచుకోవాలా..? వీటిని నిత్యం తినండి!”
పల్లీలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా..!!”
మిల్లెట్స్‌ను ఎవరైనా తినొచ్చా..? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయి..?”
ఏజ్ పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? అయితే, ఈ నాలుగు పండ్లను తప్పక తినండి!!”