డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే పల్లీలు మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. తినడానికి కూడా అందరూ ఇష్టపడతారు. అయితే, పల్లీలను ఎక్కువగా తింటే పైత్యం చేస్తుందని పెద్దవాళ్లు చెబుతుంటారు. అలా అని తినకుండా ఉంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోతాం. ఎందుకంటే వేరుశనగలు చాలా ఆరోగ్యకరమైన ఆహారం అని నిపుణులు చెబుతున్నారు. వాటిని సరైన మోతాదులో తీసుకుంటే అధిక బరువు ఈజీగా తగ్గొచ్చట.. మరి పల్లీలతో ఇంకేం ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..