Health Tips | 74 ఏండ్ల వయసులోనూ టెర్మినేటర్ మెరుపులు : ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే!
హాలీవుడ్ దిగ్గజ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ఫిట్‌నెస్‌కు పర్యాయపదంగా నిలుస్తారు. 74 ఏండ్ల వయసులోనూ నిత్యం వ్యాయామం చేస్తూ తీరైన దేహాకృతితో బలిష్టంగా ఉంటారు. శరీరంలోని అన్ని అవయవాల్లో కదలికలు ఉండేలా ఫుల్ బాడీ వర్కవుట్లకు ష్వార్జ్‌నెగ్గర్ ప్రాధాన్యత ఇస్తారు.
న్యూయార్క్ : హాలీవుడ్ దిగ్గజ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ ఫిట్‌నెస్‌కు పర్యాయపదంగా నిలుస్తారు. 74 ఏండ్ల వయసులోనూ నిత్యం వ్యాయామం చేస్తూ తీరైన దేహాకృతితో బలిష్టంగా ఉంటారు. శరీరంలోని అన్ని అవయవాల్లో కదలికలు ఉండేలా ఫుల్ బాడీ వర్కవుట్లకు ష్వార్జ్‌నెగ్గర్ ప్రాధాన్యత ఇస్తారు. ఇక చెడు కొలెస్ట్రాల్‌ను వదిలించుకునేందుకు ఐదేండ్లుగా తన ఆహారంలో 80 శాతం శాకాహారం ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మార్పుతో తాను ఆరోగ్యంగా, యవ్వనంగా ఉన్న భావన కలుగుతోందని ఆర్నాల్డ్ చెప్పుకొచ్చారు.
తనలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ గణనీయంగా తగ్గిపోవడంతో తాను వేరే వ్యక్తినని డాక్టర్ అనుకున్నాడని టెర్మినేటర్ నటుడు సరదాగా అన్నారు. ఆరోగ్యకమైన ఆహారం, వ్యాయామం తన ఫిట్నెస్ సీక్రెట్స్ అని ఆర్నాల్డ్ అంటున్నారు. వ్యాయామంతో శరీరంలో బ్యాలెన్స్, సమన్వయం పెరుగడమే కాకుండా కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా కాదు. శారీరక బలం పుంజుకోవడంతో పాటు వ్యాయామంతో మానసిక ఆరోగ్యం మెరుగై ఒత్తిడి, కుంగుబాటు దూరమవుతాయి.
ఇక ఆర్నాల్డ్ అనుసరించే మొక్కల నుంచి లభించే ఆహారంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. ప్లాంట్ బేస్డ్ డైట్‌తో కొవ్వు కరగడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌గా పిలిచే ఎల్డీఎల్ తగ్గడం, మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పెరగడంతో ఆరోగ్యకర కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెయింటెన్ చేయవచ్చు. మధుమేహం, రక్తపోటు కూడా మొక్కల నుంచి తయారయ్యే ఆహారంతో అదుపులో ఉంటాయి. దీంతో గుండె జబ్బుల ముప్పను కూడా నివారించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయి. శరీరానికి అవసరమైన పోషకాలన్నీ తక్కువ ఖర్చుతోనే ఈ ఆహారంతో అందుబాటులోకి వస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

