Virat Kohli | రాంచీలో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సీరియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. విరాట్ సెంచరీతో కదం తొక్కగా.. రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. తొలి వన్డేలో గెలిచిన టీమ్ ఇండియా ఇప్పుడు రెండో వన్డేకి సిద్ధమవుతోంది.
రెండో మ్యాచ్ (2nd ODI) రాయ్‌పూర్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు రాయ్‌పూర్ (Raipur)కు వెళ్లింది. ఈ సందర్భంగా ఆటగాళ్లకు అక్కడ ఘనంగా స్వాగతం లభించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చూసిన చిన్నారులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. గులాబీలు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాకు (IND vs SA)టెస్టు సిరీస్‌ను అప్పగించిన భారత జట్టు.. వన్డేల్లో మాత్రం శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం రాంచీలో హోరాహోరీగా జరిగిన మొదటి వన్డేలో 17 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.
this is how fans welcomed kohli in raipur😭🫶🏻 pic.twitter.com/Y1YNCNUcxd
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) December 2, 2025
Also Read..
టీమ్ఇండియాలో ఏం జరుగుతోంది?.. సీనియర్లకు, జట్టు మేనేజ్మెంట్కు గ్యాప్‌పై బీసీసీఐ ఆందోళన!