IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను టీమిండియా 17 పరుగుల తేడా గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. సెంచరీ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, తాజాగా కోహ్లీకి సంబంధించిన వీడియోలో చక్కర్లు కొడుతున్నది. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయిన వీడియో వైరల్ అయ్యింది. మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్‌ను పట్టించుకోలేదంటూ పలువురు ‘ఎక్స్’ వేదికగా వీడియోలు షేర్ చేశారు.
వీడియో ప్రకారం.. విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌కు మెట్లు ఎక్కుతు వెళ్లాడు. అక్కడ గంభీర్‌ను చూశాడు. ఆ తర్వాత తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీసి.. చూసుకుంటూ వెళ్లిపోయాడు. గంభీర్ విరాట్‌నే చూస్తు ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇదిలా ఉండగా.. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం రాంచీలో తొలి మ్యాచ్ జరిగింది. కింగ్ కోహ్లీ 102 బంతుల్లో తన కెరీర్లో 52వ సెంచరీ చేశాడు. కోహ్లీకి ఇది 83వ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్వదేశంలో జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న బ్యాట్స్‌మన్‌గా విరాట్ ఘనత సాధించాడు. అవార్డును 32వ సారి అందుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కాలిస్, టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు ప్లేయర్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును 31 సార్లు అందుకున్నారు.
ఇక వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ పేరిట ఉండేది. టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. కోహ్లీ తాజాగా ఆ రికార్డును అధిగమించాడు. కోహ్లీ 294 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నారు. కోహ్లీ ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. సచిన్ వన్డేల్లో 49 సెంచరీలు సాధించాడు. ఈ సంవత్సరం కోహ్లీకి ఇది రెండవ వన్డే సెంచరీ. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై అజేయంగా 100 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేసి 11 ఫోర్లు, ఏడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
Kohli completely ignored gambhir after the spectacular win… Swag of #ViratKohli𓃵 🔥🔥 pic.twitter.com/lb77xUBWAL
— Prittam Kothadiya 🇮🇳 (@KothadiyaSpeaks) December 1, 2025