ఒక నెలరోజులు క్రికెట్ నుంచి రెస్ట్ తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో కనబడుతున్నాడు. ఆసియా కప్ నుంచి రాణిస్తున్న అతను.. పొట్టి ప్రపంచకప్లో ఎలాగైనా జట్టును గెలిపించాలని కసిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే కఠోర సాధన చేస్తున్నాడు. రెండ్రోజుల్లో పాకిస్తాన్తో భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే.
మామూలుగానే పాకిస్తాన్తో ఆడటాన్ని ఎంజాయ్ చేసే కోహ్లీ.. ఈ మ్యాచ్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఎంసీజీ మైదానంలో త్రో డౌన్ సెషన్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ టైంలో వీడియో తీస్తున్న ఒక ఫ్యాన్ ‘అవుట్ ఆఫ్ ది స్టేడియం’ అని అరిచాడు. అది విన్న కోహ్లీ చటుక్కున వెనక్కు తిరిగాడు. ‘యార్ ప్రాక్టీస్ కే టైం మే బోలో మత్, డిస్ట్రాక్షన్ హోతీ హై’ (ప్రాక్టీస్ టైంలో అలా అరవకండి. డిస్ట్రాక్ట్ అయిపోతాం) అని చెప్పాడు.
కోహ్లీ అలా చెప్పడంతో అర్థం చేసుకున్న ఫ్యాన్.. ‘జబ్ రిలాక్స్ హోంగే తబ బోలేంగే. కింగి కేలియో తో బోలేంగే హీ. కింగ్ హై వో’ (ప్రాక్టీస్ టైంలో అరుస్తాం. కింగ్ కోసం కచ్చితంగా అరిచి కేకలు పెడతాం. ఆయన కింగ్) అని చెప్పడం వీడియోలో వినిపించింది. ఏదేమైనా కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు కదా. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
During the practice Virat Kohli calmly said something like this to the fans .@imVkohli 👑 pic.twitter.com/3X5LnNTQsV
— Hemant Singh (@Hemant18327) October 20, 2022