హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ-2 సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు బుధవారం టి కె ట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు(గురువారం) రాత్రి 8 గంటలకు ప్రీమియర్‌షోకు ప్రభుత్వం అనుమతి ఇ చ్చింది. ఇందుకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. దీంతోపాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 చొప్పున పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.
ఈనెల 12 నుంచి 14 వరకు ఈ ధరలు అమలులో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. టికెట్ రేట్లు పెంచేది లేదని గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, మరోమారు మాట తప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెంచి న ధరలతో వచ్చిన ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికిగాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్‌కు అందించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.