దుబాయ్: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో దిగ్గజ ద్వయం రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ సత్తాచాటారు. తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ సూపర్ ఫామ్ కనబరిచారు. ముఖ్యంగా కోహ్లీ రెండు సెంచరీలు సహా అర్ధసెంచరీతో 302 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
తాజా ఫామ్‌తో రెండు ర్యాంక్‌లు మెరుగుపర్చుకున్న కోహ్లీ ప్రస్తుతం 773 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు ఎగబాకగా, రోహిత్‌శర్మ(781) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.