Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9లో 94వ రోజు ఆసక్తికర సంఘటనలతో సాగింది. లీడర్ బోర్డు స్కోర్స్ పెంచుకునేందుకు హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ అనేక టాస్కులు అందించారు. ఈ స్కోర్స్ ద్వారా నామినేషన్స్ నుంచి తప్పించుకుని ఫినాలే వీక్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని చెప్పడంతో హౌస్‌లో ఉత్కంఠ నెలకొంది. మొదటగా ‘పట్టుకో పట్టుకో’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో సంజన పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఆమె , కళ్యాణ్ సంచాలకులుగా వ్యవహరించారు. ఇద్దరూ విసిరే బాల్స్‌ను పోటీదారులు జంబో ప్యాంట్స్‌తో పట్టుకోవాల్సిన ఈ టాస్క్‌లో తనూజ ఎక్కువ బాల్స్ పట్టుకుని విజేతగా నిలిచింది.
ఈ టాస్క్ అనంతరం సంచాలకులైన కళ్యాణ్, సంజన మధ్య వివాదం చెలరేగింది. కళ్యాణ్ తనూజకు ఫేవర్ చేశాడని సంజన పరోక్షంగా ఆరోపించింది. తనూజ వైపే ఎక్కువ బాల్స్ విసిరి ఆమెను గెలిపించాడని సంజన వ్యాఖ్యానించింది. దీనికి స్పందించిన కళ్యాణ్, “నేను తనూజకు కేవలం ఒక బాల్ మాత్రమే ఎక్స్ట్రా వేశాను” అని సమాధానమిచ్చాడు. ఈ వాదనలో తనూజ కూడా ఎంట్రీ ఇచ్చి సంజనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. “కళ్యాణ్ నాకు ఒక బాల్ ఎక్కువ వేశాడని అంటున్నారు, కానీ సంజనా కూడా అదే చేసింది” అంటూ తనూజ ఎదురు ప్రశ్నించింది. తర్వాత భరణి -సంజన సీక్రెట్‌గా మాట్లాడుకుంటూ కళ్యాణ్–తనూజ రిలేషన్ గురించి చర్చించారు. భరణి మాట్లాడుతూ, “ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఉంది కానీ తనూజ మరీ కమాండ్ చేస్తోంది” అని వ్యాఖ్యానించాడు.
తర్వాత బిగ్ బాస్ మరో టాస్క్ అందించారు. ఇందులో ఇమ్మాన్యుయేల్, పవన్ సంచాలకులుగా వ్యవహరించారు. బోర్డ్స్‌ను ఫిట్ చేసి జారుతున్న రోప్‌లను పట్టుకుని నిలబడే ఈ కఠినమైన టాస్క్‌లో భరణి విజయం సాధించాడు. తర్వాతి స్థానాల్లో సంజన, తనూజ నిలిచారు. హౌస్‌లోకి కొందరు ప్రేక్షకులు ప్రవేశించి పోటీదారులతో మాట్లాడే అవకాశం దక్కింది. ఓటు అప్పీల్ చేసే అవకాశం తనూజకు లభించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెను ప్రశ్నిస్తూ, “ఈ వారం మీరు కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్‌లకు సడెన్‌గా సపోర్ట్ చేస్తున్నారు… ఈ మార్పు ఎందుకు?” అని అడిగాడు. దీనికి తనూజ సమాధానంగా, “ఇన్ని రోజులు కలిసి ఉన్నాం… ఆంత సపోర్ట్ కూడా చేయకపోతే ఎలా?” అని తెలిపింది. మొత్తానికి 94వ రోజు ఆసక్తికరంగా సాగింది.